పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశవ్యాప్తంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కార్తికేయ-2 మూవీ పై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ థియేట్రికల్ వసూళ్ల పరంగా 70 ప్లస్ కోట్ల వసూళ్లని రాబట్టి రూ. 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. నాన్ థియేట్రికల్ వసూళ్ల పరంగా రూ. 30 కోట్లని రాబట్టిన ఈ మూవీ ఈ రెండు వసూళ్లని బట్టి ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇంత త్వరగా రూ. 100 కోట్ల మార్కుని చేరిన సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: