గాడ్ ఫాదర్ టీజర్ కు మాసివ్ రెస్పాన్స్

Chiranjeevis Godfather Teaser Gets Massive Response,Latest 2022 Telugu Movie,2022 Telugu Teasers,2022 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2022,2022 Latest Telugu Teasers,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2022,GodFather Telugu Movie Teaser,GodFather Movie Teaser,GodFather Teaser,GodFather Telugu Teaser,GodFather Movie Telugu Teaser,GodFather Official Teaser,Chiranjeevi GodFather Teaser,GodFather Teaser Update,GodFather Movie Teaser Launch,GodFather,GodFather Movie,GodFather Telugu Movie,Chiranjeevi,Salman Khan,Nayanthara,Mohan Raja,Thaman S,Chiranjeevi GodFather Movie Teaser,GodFather Movie Latest Update,God Father Teaser,God Father Telugu Teaser,Chiranjeevi Godfather,Megastar Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie Teaser,Chiranjeevi Latest Movie Teaser,Godfather Teaser Gets Massive Response,Godfather Teaser Views

మొత్తానికి మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సందర్భంగా చిరు బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు టీజర్ తో ఒకరోజు ట్రీట్ ఇవ్వనున్నట్టు ప్రకటించిన చిత్రయూనిట్.. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు, కానీ సడన్గా తిరిగి వచ్చిన ఆరేడేళ్లలోనే జనాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది టీజర్. ఇక్కడికి ఎవరు వచ్చినా పట్టించుకోను కానీ అతను మాత్రం రాకూడదు అంటూ నయనతార చెబుతున్న డైలాగ్, సత్యదేవ్, సముద్రఖని ఎంట్రీ సినిమాపై మరింత అంచనాల పెంచే విధంగా మారింది. ముఖ్యంగా చిరుకు ఇచ్చిన ఎలివేషన్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటుంది. విడుదలైన కొద్ది సేపటికే 2 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత వెంటనే 4 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని ట్రైండింగ్ లోకి వచ్చేసింది.

కాగా ఈసినిమా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ నటించిన పాత్రలో సత్యదేవ్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సునీల్ మెగాస్టార్ చిరంజీవి అనుచరుడి పాత్రలో నటిస్తుండగా ఒక కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కనిపించబోతున్నారు.

ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =