నరేష్ ఉగ్రం ఫస్ట్ లుక్ రిలీజ్

Ugram movie first look out now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ugram,Ugram Movie,Ugram Telugu Movie,Ugram Movie Update,Ugram First Look,Ugram Movie First Look,Ugram Telugu Movie First Look,Ugram Movie First Look Poster,Ugram First Look Poster,Ugram Movie Poster,Allari Naresh,Allari Naresh Movies,Allari Naresh New Movie,Allari Naresh Latest Movie,Allari Naresh Ugram First Look,Allari Naresh Ugram Movie First Look,Allari Naresh Ugram Movie,Allari Naresh Ugram,Naresh60,Naresh60 Movie,Vijay Kanakamedala,First Look poster of Ugram,Allari Naresh New Movie Title,Naresh60 Movie Title,First Look poster of Ugram,Ugram First Look Unveiled

కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ప్రయోగాత్మక సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలోనే నాంది లాంటి సినిమాతో తన రీఎంట్రీకి నాంది పలికాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం అయితే రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడలతోనే నరేష్ మరో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. సంకెళ్లు ఉన్న రెండు చేతులు.. గోడపై పక్షి నీడలా కనిపించేలా ఉంది ఆ పోస్టర్. తాజాగా ఈసినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఉగ్రం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వీపు భాగంలో కత్తి గుచ్చుకొని ఉన్న అల్లరి నరేష్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే పూర్తిగా వైల్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్టు అర్థమవుతుంది.

‘కాగా నరేష్ కెరీర్ లో 60వ సినిమాగా వస్తున్న ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 2 =