ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్, రష్మీ , శ్రీముఖి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భోళా శంకర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిరంజీవి బర్త్ డే సందర్భంగా భోళా శంకర్ మూవీ ఏప్రిల్ 14 రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేస్తూ చిరంజీవి స్టైలిష్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో చిరు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. హీరోలను స్టైలిష్ గా ఆవిష్కరించడంలో దర్శకుడు మెహర్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. భోళా శంకర్ లో చిరంజీవిని అంతే స్టైలిష్ గా, అభిమానులను అలరించేలా ఆవిష్కరిస్తున్నారని పోస్టర్లు చెబుతున్నాయి. ఇప్పటివరకూ భోళా శంకర్ మూవీ 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందనీ , భావోద్వేగాలు తో పాటు కమర్షియల్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతుందనీ దర్శకుడు తెలిపారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























