యాక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ ఆంటోనీ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు విజయ్ ఆంటోనీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోటస్ పిక్చర్స్ , ఇన్ ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్ పై బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ , రితిక సింగ్ జంటగా తెరకెక్కిన “కొలై ” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ “హత్య” సెప్టెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , రాధికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటించారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ “హత్య” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఒక మోడల్ మర్డర్ మిస్టరీని ఛేదించే ఆఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోనీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఉత్కంఠ రేపే సీన్స్‌తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: