మినిమం కామన్ సెన్స్ ఉండాలి వాళ్లకు

Dil Raju clears about rumours on Karthikeya 2,Karthikeya 2 Success Meet: Dil Raju Clarifies The Rumours,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Success Meet,Ace Producer Dil Raju,Dil Raju Clarifies Abour Karthikeya 2 Movie Success Meet,Nikhil Siddharth latest Movie Karthikeya 2,Dil Raju About Nikhil Siddarth Karthikeya 2 Movie

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ మొత్తానికి లేట్ గా వచ్చినా సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా కార్తికేయ 2. ఈసినిమా ఎన్నో వాయిదాల అనంతరం ఈనెల 13వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ ను అందుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో అలానే ఓవర్సీస్ లో ఈసినిమా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. కార్తికేయ 2 సినిమాకు ఎపిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. పాండమిక్ కన్నా ముందు స్టార్ట్ చేసి టీమందరూ ఎంతో కష్టపడి ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇండియా వైడ్ గా రిలీజ్ చేసిన టీమ్ కు ముందు కంగ్రాట్స్. జూన్ జులై లో పరిస్థితులు చూసి ఇండస్ట్రీ ఎటు వెళుతుందో అని భయమేసింది..ఆగష్ట్ నెల కాస్త ప్రాణం పోసింది.. బింబిసార, సీతారామం అలానే కార్తికేయ2 సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి.. అందుకు ఇండస్ట్రీ తరుపున చిత్రయూనిట్స్ థాంక్యూ. ఒక్కొక్క సినిమా ఇలా ఆడటం మాకు కూడా ఇన్ఫిరెషన్ గా ఉంటుంది. ఈసినిమా రిలీజ్ ముందు నుండీ నిఖిల్ నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. జులై 8న థాంక్యూ సినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నాం.. అయితే ఆసినిమా ఆ టైమ్ కు రెడీ అవ్వకపోవడంతో ప్రొడ్యూసర్ వివేక్ గారికి ఫోన్ చేశా. వివేక్ మీరు 22న ఏదో డేట్ ఫిక్స్ చేసుకున్నారంటా.. మా సినిమా రిలీజ్ కు అవకాశం ఇస్తారా అని అడిగా.. అందుకు వివేక్ గారు కూాడా ఓకే సార్ హీరో-డైరెక్టర్ గారితో చెప్పి చూస్తాం అన్నారు.. ఒకరోజు నిఖిల్-చందూ కలుస్తా అని అడిగారు.. ఇంటికి వచ్చి మాట్లాడారు.

నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా మధ్యఎంత హెల్దీ రిలేషన్ ఉంటుందో అని చెప్పడానికి చెబుతున్నాను.. కానీ ఆ హెల్దీ నెస్ ను బయటకు వేరేలా తీసుకెళ్లి మామధ్య గ్యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు సక్సెస్ మీట్ రోజు నేను ఇలా మాట్లాడటం చాలా బాధగా ఉంది. కానీ మాట్లాడలేదు అనుకో ఇండస్ట్రీ లో మాకు ఏదో యూనిటీ లేదు అనుకుంటారు. ప్రొడ్యూసర్స్ అంటే మేము 99 పర్సంట్ మాట్లాడుకొని రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటాం.. మాకూ క్లాష్ లు ఉంటాయి.. అయితే వాటిని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటా. చందూ-నిఖిల్ వచ్చి నాతో మాట్లాడారు.. సార్ అడిగారంటా నో ప్రాజ్లమ్ మేము వేరే డేట్ చూసుకొని రిలీజ్ చేసుకుంటాం.. క్లాష్ వద్దు సార్ అని చెప్పారు. ఇద్దరికీ థ్యాంక్యూ చెప్పాను.. అక్కడితో అయిపోయింది మా సమస్య. మీరు ఏడేట్ అనుకుంటే చెప్పండి.. నా సైడ్ నుండి నేను చేయాల్సిన హెల్ప్ చేస్తాను అని చెప్పాను ఇద్దరికీ.. అయితే 5నరిలీజ్ చేద్దామనుకున్నారు.. కానీ ఆరోజు మరో రెండు సినిమాలు ఉన్నాయి.. వాటికి ఫీడ్ బ్యాక్ కూడా బావుందంటున్నారు.. వేరే ఆలోచించండి.. అయితే మీదే ఫైనల్ డెసిషన్ అన్నాను. 12న రిలీజ్ చేద్దామనుకుంటున్నామని చెప్పారు. అప్పటికీ కోబ్రా రిలీజ్ డేట్ వాయిదా పడటంతో మంచి వీకెండ్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఇక ఫైనల్ గా 12న వద్దామని ఫిక్స్ అయిపోయారు.

కానీ ఈగ్యాప్ లో ఎవరికి తోచింది వాళ్లు రాసేసుకుంటున్నారు. సినిమాను తొక్కేస్తున్నారు.. అదీఇదీ అని.. ఇక్కడ ఉండేవాళ్లం ఎవ్వరం సినిమాను తొక్కేసుకోరు..అది రాసేవాళ్లకు.. చదివేవాళ్లకు.. వినే వాళ్లకు ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్. సినిమా ఆడితే మేము ఆనంద పడతాం.. ఆసినిమా మాకు ఊపిరి పోస్తది వేరే సినిమా తీయడానికి.. అంతేకానీ మాలో మాకు ఏదో క్రియేట్ చేస్తూ.. మీ క్లిక్ ల కోసము, మీ సబ్ స్క్రైబర్స్ ను పెంచుకోవడం కోసం మమ్మల్ని బలిపశువుల్ని చేయొద్దు. నా మీదు ఎప్పటినుండో ఇలాంటివి వస్తూనే ఉన్నాయి.. అయితే నేను చాలా ఓపికగా ఉన్నాను.. పెద్దవాళ్లు చెబుతుంటారు నువ్వెప్పుడూ మాట్లాడకూ.. కామ్ గా ఉంటూ అని.. నేను కూడా కామ్ గోయింగ్ పర్సన్.. నాకు ఎవరితోనూ క్లాషస్ పెట్టుకోవడం ఇష్టంఉండదు.. నిఖిల్ హ్యాపీడేస్ కానీ యువత కానీ నాకు మొదటి నుండి చాలా క్లోజ్.. తను కథ సెలక్ట్ చేసుకున్నా మేము డిస్కస్ చేస్కూనే ఉంటాం..

అయితే మళ్లీ నిఖిల్ తన మేనేజర్ వచ్చి 12 సినిమాలు ఉన్నాయి కదా ఏం చేద్దామని అడిగారు.. అప్పుడు అందరు డిస్ట్రిబ్యూటర్స్ ను అడగండి డైరెక్ట్ క్లాష్ కాకుండా ఒకరోజు ముందూ వెనుక రావచ్చని సలహా ఇచ్చాను.. సలహా మాత్రమే ఇచ్చాను.. ఫైనల్ కాల్ మీదే అని కూడా చెప్పాను.. ఇక 13న రిలీజ్ చేసుకున్నారు. వాళ్లకు నాపై ఎంత అభిమానమంటే ఈసక్సెస్ మీట్ కు మీరు తప్పకుండా రావాలని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు.. మీరు అంత ఆప్యాయంగా పిలుస్తుంటే ఎందుకురాను అని వచ్చాను. ఈ చిత్రయూనిట్ అందరితో నాకు అంత మంచి అటాచ్ మెంట్ ఉంది..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే మాములు ప్రొడక్షన్ హౌస్ కాదు.. టాలీవుడ్ లో ఉన్న నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌసుల్లో ఒకటి.. అలాంటి సంస్థ నుండి వస్తున్న సినిమాను ఎవరైనా తొక్కగలరా.. వాస్తవాలు మీకు తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి.. సర్ ఈ ప్రాబ్లమ్ వినిపిస్తుంది నిజమా అని కనుక్కోని చేయాలి.. సినిమా కోసం నేను ప్రాణం ఇస్తా.. సినిమాను నేను పాడుచేయాలని చూడను.. సినిమా అంటే నాకు లవ్.. సినిమా అంటే నాకు ప్రాణం.. వాస్తవాలను తెలుసుకొని రాయండి అంటూ రూమర్స్ పై ఫైర్ అయ్యారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + three =