‘సూర్య’ సినిమాకు 5 నేషనల్ అవార్డ్స్…!

Suriya’s Soorarai Pottru Movie Bags 5 National Awards,Suriya Emotional Note after winning National Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Suriya,Hero Suriya,Tamil Super Star Suriya,Suriya Emotional Note,Suriya Emotional Note After Winning National Awards,Suriya Grabs National Awards, Suriya Emotional Note After Winning National Award Goes Viral In Social Media,Suirya Soorarai Pottru Wins 5 Nantional Awards,Suirya Soorarai Pottru Movie,Suirya Soorarai Pottru Tamil Movie, Suirya Soorarai Pottru Grabs 5 Nantional Awards,Suriya Wins 5 Nantional Awards For Soorarai Pottru Movie

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ‘సూరరై పోట్రు’. ఇక తెలుగులో ఈసినిమాను ఆకాశమే నీ హద్దురా..! అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. కరోనా వల్ల ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా కూడా ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమాకు పలు అవార్డులు కూడా దక్కాయి. ఈసినిమా ఆస్కార్ బరిలోకి కూడా వెళ్లింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

68వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు న్యూ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌ లో ప్రకటించారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా గత ఏడాది నేషనల్ ఫిలిం అవార్డ్స్ ను ప్రకటించలేకపోయారు. అందుకే ఈ ఏడాది 2020లో విడుదలైన సినిమాలకు అవార్డులను అనౌన్స్ చేశారు. దీనిలో భాంగానే సూర్య నటించిన సూరరై పోట్రు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. సూర్యకు ఉత్తమ నటుడిగా.. అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన అపర్ణ మురళి జాతీయ ఉత్తమ నటి అవార్డుని కైవసం చేసుకుంది. వీటితో పాటు ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీలో జీవీ. ప్రకాష్‌ కుమార్‌), ఉత్తమ స్క్రీన్‌ప్లే కేటగిరీలో సుధా కొంగర, షాలిని ఉషాదేవి లకు అవార్డులు దక్కాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.