‘నాట్యం’ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్

Natyam Movie Bags 2 National Awards,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Natyam,Natyam Movie,Natyam Telugu Movie,Natyam Movie latest Updates,Natyam Movie Awarded with Two National Awards,Natyam Movie Bags Two national Awards, Natyam Movie Latest Updates,Natyam Movie Directred By Revanth Korukonda,Revanth Korukonda Latest Movie Bags National Award, Actress Sandhya Raju,Sandhya Raju,Sandhya Raju latest Movie Natyam,Sandhya Raju Natyam Movie Bags Two National Awards

కళకు సంబంధించిన సినిమాలు రావడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అందులోనూ కమర్షియల్ సినిమాలు ప్రయోాగాత్మక సినిమాలు రాజ్యమేలుతున్న ఇప్పటి పరిస్థితుల్లో ఆర్ట్ బేస్డ్ సినిమాలు రావడం వచ్చినా బాక్సాఫీస్ వద్ద విజయం దక్కించుకోవడం కష్టం. కానీ అలాంటి సినిమాలకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ కోవకు చెందిన సినిమానే నాట్యం సినిమా. గతంలో సంగీతం, నృత్యం నేపథ్యంలో సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు చాలా తక్కువయ్యాయి. అలాంటిది ఇప్పుడు నృత్యం నేపథ్యంలో సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు నాట్యం టీమ్. ఇప్పటికే ఈ టీమ్ ఎన్నో గౌరవాలను అందిపుచ్చుకుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రదర్శించబడింది ఈసినిమా. ఇక ఇప్పుడు ఈసినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రతి ఏడాది నేషనల్ అవార్డ్స్ ను ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఏడాది కూడా 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. దీనిలో భాగంగానే నాట్యం సినిమాకు రెండు నేపనల్ అవార్డ్స్ దక్కాయి. ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరీలో సంధ్యారాజుకు అలానే ఉత్తం మేకర్ ఆర్టిస్ట్ గా టి.వి రాంబాబు అవార్డును సొంతం చేసుకున్నారు. మరి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా రెండు కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం.

ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో చూడకుండా మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసి ఏంజాయ్ చేసేయండి.

కాగా ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో ఈసినిమా రూపొందించబడింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నిశ్రింకళ ఫిల్మ్‌ బ్యానర్స్ పై రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కమల్ కామరాజు , రోహిత్ బెహల్ , ఆదిత్య మీనన్ , భానుప్రియ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 8 =