నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ పై హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్

Suriya Emotional Note after winning National Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Suriya,Hero Suriya,Tamil Super Star Suriya,Suriya Emotional Note,Suriya Emotional Note After Winning National Awards,Suriya Grabs National Awards, Suriya Emotional Note After Winning National Award Goes Viral In Social Media,Suirya Soorarai Pottru Wins 5 Nantional Awards,Suirya Soorarai Pottru Movie,Suirya Soorarai Pottru Tamil Movie, Suirya Soorarai Pottru Grabs 5 Nantional Awards,Suriya Wins 5 Nantional Awards For Soorarai Pottru Movie

2డి ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధా కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన “సూరారై పోట్రు “(ఆకాశంనీ హద్దురా !) తమిళ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. భార్యాభర్తలుగా నటించిన సూర్య , అపర్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా 2020 సంవత్సరానికి సంబంధించిన 68వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులలో “సూరారై పొట్రు” మూవీ 5 నేషనల్ అవార్డులు గెలుచుకుంది. ఈ మూవీ బెస్ట్ ఫిల్మ్ , బెస్ట్ యాక్టర్ , బెస్ట్ యాక్ట్రెస్ , బెస్ట్ స్క్రీన్ ప్లే , బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేటగిరీ లో అవార్డ్స్ గెలుచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”సూరారై పోట్రు”కు ఐదు జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉందనీ , మా చిత్రానికి నాతో పాటు జాతీయ అవార్డు గ్రహీతలు – అపర్ణ బాలమురళి (ఉత్తమ నటి), జి.వి.ప్రకాష్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్), సుధా కొంగర & షాలిని ఉషా నాయర్ (ఉత్తమ స్క్రీన్‌ప్లే)లకు తన హృదయపూర్వక అభినందనలనీ ,తన నటనా సామర్థ్యాలపై నమ్మకం ఉంచి తన మొదటి చిత్రం “నెరుక్కు నెర్‌”మూవీ ని అందించిన దర్శకుడు వసంత్‌ సాయి & చిత్ర నిర్మాత మణిరత్నంలకు కృతజ్ఞతలనీ , తన తోటి ఉత్తమ నటుడి విజేత అజయ్ దేవగన్ మరియుఇతర జాతీయ అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక అభినందనలనీ , “సూరారై పోట్రు” చిత్రాన్ని నిర్మించి, నటించాలని పట్టుబట్టిన జ్యోతికకు తన ప్రత్యేక ధన్యవాదాలనీ , ఇప్పటివరకుతన ప్రయత్నాలను ప్రోత్సహించిన వారందరికీ మరియు తనకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి ధన్యవాదాలనీ , ఈ అవార్డును తన కుటుంబానికి అంకితం చేస్తున్నాననీ , ఫ్యాన్స్ అందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలనీ , భారత ప్రభుత్వానికి మరియు జాతీయ అవార్డుల జ్యూరీకి తన హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ హీరో సూర్య. ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.