ఇప్పటికే కరోనా వల్ల రెండేళ్లపాటు సినీ పరిశ్రమలకు చాలా ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయాయి. ఇక సెలబ్రిటీలు కూడా ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ పరిస్థితికి వచ్చి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మళ్లీ కరోనా ప్రభావం కనిపిస్తుంది. సెలబ్రిటీలు మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గానే వరలక్ష్మీ శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ రాగా తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు కూడా కరోనా పాజిటిన్ నిర్థారణ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. వైద్యులు చెబుతున్న సమాచారం ప్రకారం.. మణిరత్నం కు మైల్డ్ ఫీవర్ రావడంతో కోవిడ్ టెస్ట్ చేయింకోగా నెగిటివ్ వచ్చిందని.. తనకు కరోనా పాజిటివ్ రాలేదని చెబుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈసినిమాలో శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్, పార్థీబన్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, అరవింద్ స్వామి, త్రిష, జయరామ్, విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరి మణిరత్నం కూడా ఎంతోకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసినిమాతో తను హిట్ ను కొడతారేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: