వరుస విజయాలతో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న నాగ చైతన్య ఇప్పుడు థాంక్యూ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాను. మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తోనే నాగ చైతన్య థాంక్యూ సినిమా చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక జులై22 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇప్పటి వరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు, అలానే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ నేడు జులై 12వ తేదీన సాయంత్రం 6గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The magic word Thank You is all set to cast its magic✨#ThankYouTheMovie Trailer to release on 12th July @ 6:03 PMhttps://t.co/tVOJLzlZWj@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalvikaNair @avika_n_joy @SaiSushanthR @adityamusic pic.twitter.com/44bskBnDwh
— Sri Venkateswara Creations (@SVC_official) July 11, 2022
ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్,మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న చైతు ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతాడేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: