సూర్య-బాల మూవీ టైటిల్ రిలీజ్..!

Suriya and Bala Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vanangaan,Vanangaan movie,Vanangaan Movie Updates,Vanangaan Suriya Upcoming movie,Suriya Upcoming Movie Titled Vanangaan, Suriya 41 is now titled Vanangaan,Suriya41 Movie Titled Vanangaan,Bala Upcoming Movie with Suriya Titled Vanangaan,Suriya Movie Updates,Suriya Upcoming Movies in 2022, Suriya movie Updates,Suriya new Movie Updates,Suriya Next Project with Bala

తమిళ్ స్టార్ హీరో సూర్య విలక్షణ డైరెక్టర్ బాల కాంబినేషన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శివ పుత్రుడు సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. సూర్యకి సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టింది ఆసినిమా. ఆతరువాత కూడా వారిద్దరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు దాదాపు 18 ఏళ్ల తరువాత మళ్లీ వీరిద్దరి సినిమా వస్తుంది. సూర్య కెరీర్లో 41వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై.. ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సముద్ర నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే మధ్యలో ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలకు సూర్య అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫ్క్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. నేడు బాల పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను ప్రకటించారు. ఈసినిమాకు అచలుడు అన్న టైటిల్ ను ఫిక్స్ చేశారు.

కాగా ఈసినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ ను కూడా తీసుకోనున్నట్టు సమాచారం. ఈ సినిమాను 2డి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జ్యోతిక నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + fourteen =