‘ఆది పురుష్’ విజువల్స్ చూశా.. ఫ్యాన్స్ కు పండగే..!

Akash Puri about Prabhas Adipurush Visuals,Akash Puri Reveals Something Interesting About Adipurush Visuals,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akash Puri,Hero Akash Puri,Actor Akash Puri,Akash Puri About Adipurush Movie,Akash Puri Reveals Interesting About Adipurush Movie Visuals,Adipurush Movie,Adipurush Telugu Movie,Prabhas Adipurush Movie Updates, Prabhas Adipurush Movie Visuals,Akash Puri Reveals Interesting About Prabhas Adipurush Movie Visuals,Akash Puri Upcoming Movie Chor Bazaar,Chor Bazaar Telugu movie,Chor Bazaar Movie Updates,Chor Bazaar Releasing On 24th June, Akash Puri Chor Bazaar Movie Latest Updates,Akash Puri Says Adipurush is a Visuals Treat For Fans

పాన్ ఇండిాయ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ప్రభాస్ సినిమాల నుండి అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు పూరీ తనయుడు ఆకాష్ పూరీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచేశాయి. ఆకాష్ పూరీ హీరోగా చోర్ బజార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఈనెల 24వ తేదీన రిలీజ్ కానున్నసంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ఆకాష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్ ఆది పురుష్ సినిమా గురించి మాట్లాడుతూ నా రొమాంటిక్ సినిమా సమయంలో ప్రభాస్ తో ఇంటర్వ్యూ జరిగింది. ఆసమయంలో ఆది పురుష్ సినిమా విజువల్స్ కొన్ని చూపించారు. ఆ విజువల్స్ లో ప్రభాస్ మామూలుగా లేడు ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్. ఇప్పుడు ఆది పురుష్ గురించి ఆకాష్ మాట్లాడిన మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆకాష్ ఇచ్చిన ఆది పురుష్ మూవీ అప్డేట్ తో ప్రభాస్ అభిమానులు సైతం హ్యాపీగా ఉన్నారు.

ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.

ఇక పూరీ జగన్నాథ్ కి , ప్రభాస్ ఫ్యామిలీ కి మధ్య మంచి బాండిగ్ ఉన్న విషయం తెలిసిందే. పూరీ దర్శకత్వంలోనే ప్రభాస్ హీరోగా ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలు వచ్చాయి. ఈరెండు సినిమాల్లో ప్రభాస్ మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. ఆ బాండిగ్ వల్లో ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ప్రభాస్ ఏ స్థాయిలో ప్రమోట్ చేశాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత బిజీ షెడ్యూల్ లో ఉండే తను.. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు ఏకంగా రొమాంటిక్ సినిమా టీంతో ఇంటర్వ్యూ కూడా చేశాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.