మాస్ రోల్ లో వైష్ణవ్ తేజ్..!

Vaishnav Tej In Mass Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vaishnav Tej,Hero Vaishnav Tej,Actor Vaishnav Tej,Vaishnav Tej Upcoming Movies,Vaishnav Tej Mass Role in His Upcoming Movie,Vaishnav Tej Latest Mass Tole in Upcoming Movie, Vaishnav Tej Mass Role,Vaishnav Tej Latest Movie Updates,Vaishnav Tej Shooting Updates,Vaishnav Tej latest Shooting Updates,Vaishnav Tej New Movie, Vaishnav Tej Next Project,Vaishnav Tej Latest New Role in upcoming Movie

మెగాహీరో ట్యాగ్ తో సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మెగా హీరోలకు సైతం పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ ఉప్పెన, ఇంకా కొండపొలం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమాతో వస్తున్నాడు. గిరీశాయ ద‌ర్శ‌కత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. ఈసినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాపినీడు సమర్పణలో శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా వైష్ణవ్ తేజ్ తన నాలుగో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసారి ఫుల్ మాస్ రోల్ లో అలరించనున్నాడు వైష్ణవ్ తేజ్. ఇక ఈసినిమాను నేడు ప్రారంభించారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలో చిత్రనిర్మాణ సంస్థ ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుందని.. ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు అంటూ ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ ఫుల్ మాస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా శ్రీకాంత్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + seventeen =