‘భోళా శంకర్’ కొత్త షెడ్యూల్ షురూ..!

Bholaa Shankar New Schedule Commenced,The Action Episode Shoot For Chiranjeevi’s Bholaa Shankar Movie Resumes Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Telugu Movie,Bholaa Shankar Movie Updates,Bholaa Shankar latest movie Updates,Mega Star Chiranjeevi Bholaa Shankar movie Updates,Mega Star chiranjeevi,Chiranjeevi, Chiranjeevi Bholaa Shankar Action Episode Resumes Today,Bholaa Shankar Movie Acion Episode Begins Today,Bholaa Shankar Movie Shooting Updates,Bholaa Shankar Movie Shoot updates,Bholaa Shankar movie Action Shoot Begins Today, Chiranjeevi Action Episode Starts Today,Chiranjeevi Back to Sets of Bholaa Shankar,Bholaa Shankar Movie Action Episode Shooting Updates

రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈమధ్య ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి వార్తలు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈసినిమా కొత్త షెడ్యూల్ ను నేడు ప్రారంభించారు చిత్రయూనిట్.ఈ షెడ్యూల్‌లో స్టైలీష్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయట.. ఇందు కోసం రామ్ లక్ష్మణ్ మాస్టర్లను రంగంలోకి దించాడు మెహర్ రమేష్. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయంటున్నారు.

కాగా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =