ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తరువాత ఎస్ఆర్ కల్యాణమండపంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇటీవల సెబాస్టియన్ 524 పీసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అది బోల్తాకొట్టింది. ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు ఉన్నాయి. వీటిలో సమ్మతమే సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా సమ్మతమే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను మరోసారి వేగవంతం చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ అలానే ట్రైలర్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఈనెల 24న రిలీజ్ అవుతుండగా.. ట్రైలర్ ను 16వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
Grand release by Geetha Film Distribution ❤️
Repu trailer chudandi meku nachutundi 24th velli movie chudandi chala prashanthamga untundi ☺️#Sammathame #SammathameFromJune24th pic.twitter.com/yHeCY5ANjB
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 15, 2022
కాగా ఈసినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ ఈసినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: