విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు యంగ్ హీరో లక్ష్. ‘వలయం’ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు లక్ష్. ఇప్పుడు కాస్త విలక్షణమైన కథలను మత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆ దిశగానే తన సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేసిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. జూన్ 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా ఘనంగా విడుదల చేయనున్నారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాతో పాటు లక్ష్ ధీర అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈసినిమా సెకండ్ షెడ్యూల్ రెండు వారాలుగా వైజాగ్ లో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇక రెండు వారాల అనంతరం అక్కడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
కాగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సోనియా హీరోయిన్ గా నటిస్తుంది. చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తున్న ఈసినిమాను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: