రీసెంట్ గానే గోపీచంద్ సీటీమార్ సినిమాతో ఒక హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా కూల్ కామెడీతో నవ్వించడం మారుతి స్పెషల్. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ కూాడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఒక పాటను రిలీజ్ చేయగా నేడు సెకండ్ సాంగ్ ను ప్రోమో ను రిలీజ్ చేశారు. అందాల రాశి అంటూ వచ్చే పాట ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. జెక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఈ పాట ప్రోమో ఆకట్టుకుంటుంది. ఈపాట ట్యూన్ క్యాచీగా ఉందని చెప్పొచ్చు. అలాగే హీరోయిన్ రాశీ ఖన్నాఈ సాంగ్ లో చాలా అందంగా అలానే గోపీచంద్ కూడా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఇక ఫుల్ సాంగ్ ఈ జూన్ 1న రిలీజ్ చేయనున్నారు. ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
Here’s the promo of #AndalaRaasi from #PakkaCommercial 🤩
Full song will be out on 𝐉𝐔𝐍𝐄 𝟏𝐬𝐭!! ❤️#AlluAravind @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @adityamusic
#PakkaCommercialOnJuly1st ✨ pic.twitter.com/1FsRF9ICyL— UV Creations (@UV_Creations) May 28, 2022
ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశీ ఖన్నా నటిస్తుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశీ ఖన్నా. సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: