ఏ డైరెక్టర్ కి అయినా పెద్ద పెద్ద హీరోలతో చేయాలన్న కల ఉంటుంది. ముఖ్యంగా అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో సినిమా చేయడం అంటే ఒక డ్రీమ్ లాగ ఫీలవుతారు. అయితే ఒకప్పుడు ఇది కొంచం కష్టమయ్యేదేమో కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ లు సైతం ఒకటి రెండు సినిమాలకే స్టార్ హీరోలతో చేసే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక అనిల్ రావిపూడి కూడా అగ్రహీరోలందరితో చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. వారిలో ఇప్పటికే వెంకటేష్ తో చేసేశాడు, అలానే బాలకృష్ణతో చేయబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి దీని గురించి చెబుతూ..నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గార్లతో సినిమాలు చేయాలని అనుకున్నాను.. వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేసేశాను. త్వరలో బాలకృష్ణగారితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాను. ఇక మిగిలింది చిరంజీవి, నాగార్జున. వాళ్లతో కూడా తప్పకుండా సినిమాలు చేస్తాను అని చెప్పాడు. ఇంకా ‘మాయా బజార్’ లాంటి సినిమాను చేయాలనుందని.. అలాగే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి సోషియో ఫాంటసీ చేయాలని ఉందని తెలిపారు.
మరి డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టినప్పటినుండీ ఇంత వరకూ సక్సెస్ ను మాత్రమే అందుకున్నాడు అనిల్ రావిపూడి. నిన్న రిలీజ్ అయిన ఎఫ్ 3 సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మరి 100 పర్సెంట్ సక్సెస్ రేటు ఉన్న అనిల్ కు చిరంజీవి, నాగార్జున తో చేసే అవకాశం ఈజీగానే వస్తుందని చెప్పొచ్చు. చూద్దాం.. త్వరలోనే అనిల్ వీరిద్దరితో కూడా సినిమాలను చేస్తాడేమో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: