నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మరి తమ అభిమాన హీరో బర్త్ డే అంటే ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తారో తెలిసిందే కదా. ఒకపక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చని అలానే మరోపక్క ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తాయని వారి ఆశ. ఇక ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చి ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు గిఫ్ట్ అందించారు మేకర్స్. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని అంటూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా నుండి కూడా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఎన్టీఆర్ గడ్డంతో ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ను బట్టి ఈసినిమాలో కూడా ఎన్టీఆర్ మంచి మాస్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
And then with @prashanth_neel pic.twitter.com/cUBWeSoxfW
— Jr NTR (@tarak9999) May 20, 2022
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై తెరకెక్కించనున్నారు. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు చిత్రబృందం.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.