లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. ఇక ఈసినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సొంతం చేసుకున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థలలో ఒకటిగా శ్రేష్ట్ మూవీస్ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో ‘విక్రమ్’ సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని ప్లాన్ చేస్తున్నారు.
Extremely Glad to be associated with @RKFI to present the much awaited film of Ulaganayagan @ikamalhaasan sir’s #Vikram in Telugu under our @SreshthMovies banner 🤗
Grand Release on June 3rd 🌟#VikramFromJune3 ❤️🔥@Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial https://t.co/LJAYKb1Er4
— nithiin (@actor_nithiin) May 19, 2022
కాగా ఈసినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనుండగా సూర్య అతిధి పాత్రలో అలరించనున్నారు. ఇంకా ఈసినిమాలో కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.