తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “సర్కారు వారి పాట” మూవీ లో తన గ్లామరస్ అవతార్ లో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇకపై అల్ట్రా స్టైలిష్ అండ్ గ్లామర్ లుక్స్ పాత్రలతో ప్రేక్షకులను అలరించి పక్కా కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవాలనీ , ఇకపై నటించే చిత్రాలలో తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించాలనీ కీర్తి డిసైడ్ అయినట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: