సూపర్ హిట్ “బాజీగర్ ” (1993 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన శిల్పాశెట్టి “Mr రోమియో “మూవీ తో కోలీవుడ్ , “సాహస వీరుడు సాగర కన్య” మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. హిందీ , తెలుగు , కన్నడ , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో శిల్పాశెట్టి ప్రేక్షకులను అలరించారు. 2009 సంవత్సరంలో రాజ్ కుంద్రా ను వివాహం చేసుకుని శిల్పాశెట్టి సినిమాలకు దూరం అయ్యారు. 2021 సంవత్సరం లో శిల్పాశెట్టి “హంగామా 2” మూవీ తో బాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శిల్పాశెట్టి ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కిన “మిడిల్ క్లాస్ అబ్బాయి ” మూవీ హిందీ రీమేక్ “నికమ్మ” మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ లో శిల్పాశెట్టి మాట్లాడుతూ …. మంచి పాత్రలు దొరికితే సౌత్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అనీ , ముఖ్యం గా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తిగా ఉన్నాననీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: