టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో గోపీ గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే కూడా ఒకటి. ఈసినిమా కూడా ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ కూడా ఇస్తున్నారు. ఇక ఈసినిమాను మే 20న రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జూన్ 17వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Only the date has changed. Not the cause.
Godse from June 17, 2022. #GodseOnJune17
@MeGopiganesh @AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @theprakashnag @CKEntsOffl @vamsikaka @adityamusic pic.twitter.com/cuS9SM61XX
— Satya Dev (@ActorSatyaDev) May 18, 2022
కాగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సిజ్జు మీనన్, బ్రహ్మాజీ, ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు నటిస్తున్నారు. సికే స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం.. సురేష్ సారంగం సినిమాటో గ్రఫీ అందిస్తున్నారు. మరి గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో‘బ్లఫ్ మాస్టర్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సత్యదేవ్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ గాడ్సే సినిమా వస్తుంది. ఈసినిమా కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: