తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం 5 హిందీ , 2 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్‌తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నటిస్తూ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ పై ఉంది. ఇంతలో రెండవ ప్రాజెక్ట్ ని తాప్సీ “ధక్ ధక్” టైటిల్ తో నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవుట్ సైడర్ ఫిల్మ్స్, వయో కామ్ 18 బ్యానర్స్ పై తరుణ్ దూదేజా దర్శకత్వంలో ఫాతిమా షనా సేక్, రత్న పాఠక్ షా, దియా మీర్జా,సంజన సంఘీ ప్రధాన పాత్రలలో మహిళల హక్కుల నేపథ్యం లో “ధక్ ధక్” మూవీ తెరకెక్కుతుంది. . తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఇందులో నలుగురు నటీమణులు బుల్లెట్ బండిపై బైక్ రైడ్ కి బయల్దేరినట్టుగా ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమా కి సంబంధించి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి 2023లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: