‘కె.జి.యఫ్’ కు రెండింతలు ‘సలార్’..!

KGF DOP about Prabhas Salaar Movie,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Tollywood Movie Collections,Telugu Movie Collections,Box Office Collections, KGF,KGF Movie,KGF Movie Updates,KGF DOP latest updates,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie latest Updates,Salaar upcoming Movie Of Prabhas, Prabhas Salaar movie latest Updates,Salaar Shooting Updates,KGF DOP About Salaar Movie,KGF DOP About making Of Salaar Movie,Pan Indian Star Prabhas Salaar Movie, Rebel Star Prabahs Salaar Movie,KGF DOP Says Salaar will Twice the KGF Movie

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాకోసం ప్రభాస్ అభిమానులు ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో అవ్వడం.. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కె.జి.యప్ 2 రీసెంట్ గా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమాలో ప్రభాస్ పాత్ర గురించి వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈసినిమా లో ప్రభాస్ వయోలెంట్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న భువన గౌడ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భువన గౌడ.. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈసినిమాను చాలా డిఫరెంట్‌గా చిత్రీకరించాలనుకుంటున్నారు. అంతేకాదు మేకింగ్, బ్యాక్‌డ్రాప్ పరంగా కె.జి.యఫ్ కంటే సలార్ రెండింతలు ఉంటుందని చెప్పారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్‌ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు ఈసినిమాకు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + two =