పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే కదా. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకొని ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు పవన్. ప్రస్తుతం అయితే క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక దీని తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లో ఉంది. క్రిష్ సినిమా తరువాత ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు పవర్ స్టార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా పవన్ వినోదయ సీతం అనే సినిమాను కూడా రీమేక్ చేయనున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే దీనిపై ఇంతవరకూ అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా తమిళ టాలెంటెడ్ నటుడు సముద్ర ఖని చేసిన వ్యాఖ్యలతో ఈ రీమేక్ రావడం కన్ఫామ్ అని అర్థమైపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సముద్ర ఖని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు తను పెద్ద ఫ్యాన్ అని.. వినోదయ సీతం రీమేక్ ను తానే డైరెక్ట్ చేస్తానని చెప్పాడు. ఒక పక్క ఫ్యాన్ గా ఉంటూనే, మరొక పక్క ఆయనను డైరెక్ట్ చేస్తా.. జులై నుండి ఈసినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చు అని చెప్పారు. మరి చూద్దాం దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఏదైనా వస్తుందేమో
కాగా డైరెక్టర్, రచయిత అయిన సముద్ర ఖని కూడా టాలీవుడ్ లో బిజీ యాక్టర్ అయిపోయారు. పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలను సొంతం చేసుకుంటున్నారు. పవన్ తో భీమ్లా నాయక్.. ఇంకా తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట లో విలన్ రోల్ లో కూడా నటించి మెప్పించారు. ఇంకా పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: