ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్ లోకి వచ్చిన రామ్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ కథతో రాబోతున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది వారియర్. ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా జూలై 14న విడుదల కానుంది. ఇక మరోవైపు ఈసినిమా అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. రీసెంట్ గానే బుల్లెట్టు బండి పాటను రిలీజ్ చేయగా ఆ పాటకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ కు సంబంధించి కూడా అప్ డేట్ ఇచ్చేశారు చిత్రయూనిట్. మే 14, 2022 సాయంత్రం 5:31 గంటలకు ఈసినిమా టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా తెలియచేశారు.
కాగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ, వరలక్ష్మీశరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: