దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. రీసెంట్ గానే ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సుమంత్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సుమంత్ తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫొటో పోస్ట్ చేస్తూ ఈసినిమా పై ప్రశంసలు కురిపించారు. ఈఫొటోలో దుల్కర్, దర్శకుడు హను అలాగే హీరోయిన్ మృణాల్ మరియు మరో నటుడు రాహుల్ రవీంద్రన్, స్వప్న దత్ లు కనిపిస్తున్నారు. ఇంకా నా 22 ఏళ్ల సినీ కెరీర్ లో దుల్కర్ లాంటి కో స్టార్ ను చూడలేదు.. పాషనేట్ డైరెక్టర్ హనురాఘవపూడి, దీనివెనుక ఉన్న నిర్మాతలు ఖచ్చితంగా ఈసినిమా ఎపిక్ అవుతుంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమకథలో హీరోగా కనిపించనున్నాడు దుల్కర్ సల్మాన్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్నా సినిమాస్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: