బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బహుబలి2 “మూవీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ హీరోగా నటించిన , నటించే మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “కన్నడ మూవీ తో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారారు.”పుష్ప :ది రైజ్”మూవీ తో అల్లు అర్జున్ , “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు పాన్ ఇండియా స్టార్ స్టేటస్ అందుకున్నారు. బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ను దాటుకుని టాలీవుడ్ మూవీస్ మరియు బాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా హీరోలతో పోటీ పై ప్రభాస్ మాట్లాడుతూ .. పోటీ అనేది ఎక్కడైనా సహజమనీ , కానీ అది మీరు అనుకుంటేనే అనీ , ఇప్పుడు సినిమాలకి దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్పడిందనీ ,నిజానికి రాబోయే రోజుల్లో మనం భారతీయ సినిమాని కూడా దాటబోతున్నామనీ , అందుకే ఇక్కడ ప్రత్యర్థి అనేదానికి చోటు లేదనీ , ఇలాంటి సినిమాలను రూపొందించడం ఇప్పటికే ఆలస్యమైందని తాను భావిస్తున్నాననీ , ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నార్త్ , సౌత్ యాక్టర్స్ అంతా కలిసి భారతీయ చిత్రాలను చేయబోతున్నామనీ , అందుకు తనకు చాలా హ్యాపీగా ఉందనీ , “ఆర్ ఆర్ ఆర్ “మూవీ చూశాననీ , తనకు చాలా నచ్చిందనీ , రాజమౌళి కేవలం సౌత్ డైరెక్టర్ కాదు, ఇండియన్ డైరెక్టర్ అనీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: