టాలీవుడ్ హీరోల్లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో లిస్ట్ లోకి వెళ్లిపోయాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి తరువాత కూడా వరుసగా హిట్స్ అందుకోవడంతో మరింత ఫాలోయింగ్ పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రౌడీ హీరో సోషల్ మీడియాలో తన హవా చూపిస్తున్నాడు. రోజు రోజుకు విజయ్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. ఇటీవలే 12 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న విజయ్ చాలా తక్కువ గ్యాప్ లోనే ఇన్ స్టాలో 15 మిలియన్ ఫాలోవర్స్ ను రీచ్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఖాతాలో 18 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పుష్ప తరువాత బన్నీ క్రేజ్ బాగా పెరిగింది. మరి లైగర్ తర్వతా విజయ్ కూడా బన్నీ ని ఈజీగా రీచ్ అవుతాడని చెప్పొచ్చు.
కాగా ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. 2022, ఆగస్ట్ 25న లైగర్ సినిమా రిలీజ్ కానుంది. దీనితో పాటు పూరీతోనే జనగణమన చేయనున్నాడు విజయ్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: