హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ యంగ్ హీరో సాయి తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “కె జి ఎఫ్” మూవీతో భారతీయ సినిమాను ఉర్రూతలూగించారనీ , అంతేకాదు, దేశ వ్యాప్తంగా వినిపించారనీ , అలాగే, ఇప్పుడు “కె జి ఎఫ్ 2″తో మరోసారి భారతీయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకోవాలనీ సాయి తేజ్ ట్వీట్ చేశారు. సాయి తేజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: