స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా దగ్గుబాటి , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “బాహుబలి :ది బిగినింగ్ ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ ఘనవిజయం సాధించి భారీ వసూళ్లను రాబట్టింది. “బాహుబలి:ది కంక్లూజన్ “మూవీ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళతో హైయెస్ట్ గ్రాసింగ్ రెండవ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ మూవీ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “సాహో “, “రాధేశ్యామ్ “మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్”, “ఆదిపురుష్ “, “ప్రాజెక్ట్ K “, “స్పిరిట్ ” మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “పుష్ప :ది రైజ్”మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 350 కోట్లు కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో 100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. తాజాగా రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ప్రపంచవ్యాప్తంగా 950 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకూ 200 కోట్లుకలెక్ట్ చేయడం విశేషం. హిందీ మూవీస్ ను డామినేట్ చేసి తెలుగు మూవీస్ బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్ , చరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ గా మారారు. “లైగర్”మూవీ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారుతున్నారు. “సర్కార్ వారి పాట” తరువాత రాజమౌళితో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సూపర్ స్టార్ మహేష్ సిద్ధంగా ఉన్నారు. రామ్ చరణ్ “RC15 “, పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు “, అల్లు అర్జున్ “పుష్ప :ది రూల్ “మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గానే రిలీజ్ కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: