డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యం గ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 900 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించిన విషయం తెలిసిందే.ఎన్టీఆర్ తో ఎక్కువ సమయం స్క్రీన్ స్పేస్ ను కలిగి ఉన్న ఒలివియా జెన్నీ పాత్రకు అద్బుతంగా సెట్ అయ్యారు. తాజాగా ఒలీవియా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి , ఎన్టీఆర్ లపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి గురించి మాట్లాడుతూ అమేజింగ్ డైరెక్టర్ అనీ , ఆయనతో వర్క్ చేయడం ను కూడా గొప్ప గౌరవం అనీ , ఎన్టీఆర్ ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనీ , ఆయనతో వర్క్ చేస్తున్న సమయంలో చాలా విషయాలను నేర్చుకున్నాననీ , నర్వస్ గా ఉన్న సమయంలో ఆయన చిరు నవ్వు చూసి చాలా వరకు రిలాక్స్ అయ్యేదాన్నీ అనీ, రాజమౌళి మరియు ఎన్టీఆర్ లతో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఒలివియా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: