విజయ్ తో సినిమా.. ఎగ్జైట్ అవుతున్న రష్మిక..!

Rashmika Excited about working with Vijay,Going To Do Everything She Wants!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika,Actress Rashmika,Rashmika Movie Updates,Rashmika New Movie with Vijay,Rashmika New Movie with Vijay Thalapathy66,Rashmika Joins Vijay’s Thalapathy 66,Vijay Thalapathy66 Movie Updates, Vijay New Movie Updates,Rashmika Joins Vijay’s Thalapathy66 Upcoming Movie,IN PICS: Rashmika Joins Vijay’s Thalapathy 66,Thalapathy66 directed by Vamshi Paidipally,Sri Venkateswara Creations

ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక్కో కల ఉంటుంది. పలానా హీరోతో చేయాలని డైరెక్టర్ కు, పలానా డైరెక్టర్ తో చేయాలని హీరోకు.. అలానే హీరోయిన్స్ కు కూడా ఉంటుంది. స్టార్ హీరోస్ తో చేయాలని.. స్టార్ డైరెక్టర్స్ తో చేయాలని ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ కు తమ ఫేవరెట్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రష్మికను చూస్తుంటేనే అర్థమవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను చైన్నైలో ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేశారు కూడా. ఇక ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రష్మికకు హీరో విజయ్‌ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. విజయ్‌ అంటే క్రష్‌ అని గతంలో పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది రష్మిక. ఈనేపథ్యంలో తనకు ఇష్టమైన హీరోతో నటించే అవకాశం రావడంతో రష్మిక ఎగ్జైట్ అవుతుంది. అంతేకాదు ఈవిషయాన్ని తన ట్విట్వర్ ద్వారా కూడా చెబుతూ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంది.. ఎప్పటినుండో విజయ్ సార్ ను చూస్తున్నా.. ఫైనల్ గా ఆయతో నటించే అవకాశం వచ్చింది.. ఆయనతో యాక్ట్ చేస్తా.. డ్యాన్స్ చేస్తా.. మాట్లాడుతా..చాలా ఆనందంగా ఉంది అంటూ రష్మిక ట్వీట్‌ చేసింది.

కాగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.  సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు చిత్రయూనిట్ త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − four =