అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ఒకటి. ఇక ఈసినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కాగా అది మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఇప్పుడు మరో కొత్త రేర్ ఫీట్ ను సాధించింది. ఈసినిమా గ్రీస్ భాషలో కూడా విడుదల కానుంది. ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ సినిమా గ్రీస్ భాషలో విడుదల అవ్వలేదు. దీంతో ఈసినిమాలో మరో సరికొత్త రికార్డ్ వచ్చి చేరింది. మరి ఇంత భారీ స్థాయిలో విడుదల అవుతున్న ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: