హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.హీరో యష్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. “కె జి ఎఫ్ చాప్టర్ 1″మూవీ రీ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్దేశించిన ప్రాంతాల్లో “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ ఏప్రిల్ 8వ తేదీ రీ రిలీజ్ కానుంది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ ని రిలీజ్ చేయడం విశేషం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: