సుమన్ , భానుప్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన “చాదస్తపు మొగుడు ” మూవీ తో శరత్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సుమారు 20 సినిమాలకు శరత్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా సుమన్ , బాలకృష్ణ లతో సూపర్ హిట్స్ అందుకున్నారు.హీరో బాలక్రిష్ణతో “వంశానికి ఒక్కడు”, “పెద్దన్నయ్య”, “సుల్తాన్”, “వంశోద్దరకుడు”, సుమన్ తో “చాదస్తపు మొగుడు”, “పెద్దింటి అల్లుడు”, “బావ-బావమరిది”,”చిన్నల్లుడు” వంటి సినిమాలు శరత్ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న శరత్ ఆరోగ్యం క్షీణించడంతో.. ఇవాళ మృతి చెందారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సీనియర్ దర్శకుడు మృతి పట్ల హీరో బాలకృష్ణ తీవ్ర సంతాపం తెలియజేశారు. మంచి మనిషి , నిస్వార్ధపరుడు , మంచి దర్శకుడు , ఆప్తుడిని కోల్పోయాం అంటూ బాలకృష్ణ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: