ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు మరో హీరో కూడా పాన్ ఇండియా దిశగా అడుగువేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆహీరో ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ. వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈసినిమాతో మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే అప్పుడే సందడి మొదలైంది. ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 2న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు అదే రోజున ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు ఈసినిమాలో నటించే హీరోయిన్స్ కూడా రివీల్ చేసేశారు. ఈ సినిమా నుండి ఇప్పటికే నుపూర్ సనన్ నటిస్తున్నట్టు ప్రకటించగా.. ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా ప్రకటించారు. ఈ సినిమాలోలో గాయత్రి భరద్వాజ్ మరో లీడ్ రోల్ లో నటిస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Welcoming @gaya3bh to the Massive Hunt of @RaviTeja_offl’s #TigerNageswaraRao 🐅@DirVamsee @abhishekofficl @NupurSanon @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @CastingChhabra @UrsVamsiShekar @TNRTheFilm pic.twitter.com/LqkeeITorj
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) April 1, 2022
కాగా 1970లో స్టూవర్ట్ పురంలో పాపులర్ దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా ఈసినిమా వస్తుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు జీవీప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఇంకా రవితేజ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా సినిమా కూడా చేస్తున్నాడు. వీటితో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమా చేస్తున్నాడు. ఈమూడు సినిమాలు కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: