టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాలీవుడ్ టెక్నాలజీ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుత కాలంలో పురాణ సంబంధమైన పాత్రలను పోషించే అవకాశం రావడం చాలా అరుదు. అలాంటి ఒక అవకాశం ప్రభాస్ కి రావడం నిజంగా విశేషం. “ఆదిపురుష్” మూవీ తన కెరీర్ లోనే ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాననీ, శ్రీరాముడి పాత్ర తనని చాలా ప్రభావితం చేసిందనీ ప్రభాస్ చెప్పారు. “బాహుబలి”మూవీ తో జానపదం , “ఆది పురుష్” మూవీ తో పౌరాణికం , “ప్రాజెక్ట్ K” మూవీ తో సైన్స్ ఫిక్షన్ ను టచ్ చేసిన ప్రభాస్ అదృష్టవంతుడే అని చెప్పడంలో సందేహం లేదు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























