మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ 2018 మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 200 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు , పల్లెటూరి యువతి రామలక్ష్మి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “రంగస్థలం ” మూవీ ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు.దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు తో “రంగస్థలం “మూవీ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఫైనల్‌గా “రంగస్థలం “మూవీ 122.47 కోట్ల కలెక్షన్లను సాధించి నాన్-బాహుబలి రికార్డును సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్ కు రూ.40 కోట్ల వరకు లాభాలు అందించింది. “రంగస్థలం” సినిమాకు నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.. ఆ సినిమా జ్ఞాపకాలను సుకుమార్ షేర్ చేసుకున్నారు. సినిమా విడుదలై నాలుగు సంవత్సరాలైనా.. జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయనీ , రామ్ చరణ్ తో ఫస్ట్ మూవీ “రంగస్థలం “అనీ , రామ్ చరణ్ తో వర్క్ చేయడం ఒక గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అనీ , చిట్టిబాబు క్యారెక్టర్లో చరణ్ ఒదిగిపోయి నటించాడనీ , చరణ్ తో మరో సినిమా ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తున్నాననీ సుకుమార్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: