విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, నయనతార జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘కతువాకుల రెండు కాదల్’. తెలుగులో ఈసినిమా ‘ఖణ్మణి రాంబో ఖతీజా’ అనే టైటిల్ తో రిలీజ్ కాబోతుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందుతున్న ఈసినిమాలో విజయ్ సేతుపుతి రాంబో గా, నయనతార ఖణ్మణి పాత్రలో, సమంత ఖతీజా పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్నా మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక ఎన్నో రోజుల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా కేక్ కట్ చేసి చిత్రబృందం సెలబ్రేట్ చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోతో కలిసి విఘ్నేష్ శివన్ తన సొంత బ్యానర్ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: