డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ మొదటి రోజే 200 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా హిందీ భాషలో 100 కోట్ల క్లబ్ లో చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బెనిఫిట్ షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్ సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. అద్భుత రెస్పాన్స్ అందుకున్న”ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులకు 500 కోట్లు కలెక్ట్ చేసి 500 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “”బాహుబలి 2 “మూవీ టోటల్ రన్ లో 21. 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ తో అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ నెంబర్ వన్ గా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ 5రోజులకే 10 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ఇండియన్ మూవీ గా అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ రెండు మూవీస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: