యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈసినిమా ఈ నెల 25న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈసినిమా చూసినవారందరూ సినిమాపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అని ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు, అభిమానులు, సామాన్యులు, సినీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్టీఆర్ నోట్ విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆ నోట్ లో ఎన్టీఆర్.. ఈసినిమా విడుదలైనప్పటి నుంచి మీరు ఎన్నో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రేమాభిమానాలు చాటుతున్నారు. నా కెరీర్ లోనే గొప్ప చిత్రంగా చెప్పుకునేలా చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపాడు. అంతేకాదు నేను ఇంత గొప్పగా నటించేలా స్ఫూర్తినిచ్చిన జక్కన్నకు ధన్యవాదాలు. చరణ్ సోదరా.. నువ్వు లేకుండా ఆర్ఆర్ఆర్ ను ఊహించుకోవడం కష్టం. నువ్వు కాకుండా వేరెవరూ అల్లూరి సీతారామరాజు పాత్రకు అంత న్యాయం చేయలేరు అంటూ.. అజయ్ దేవ్ గణ్ లాంటి గొప్ప నటుడితో నటించడం నా గౌరవంగా భావిస్తున్నా..ఆలియా.. నటనకు నువ్వో పవర్ హౌస్..ఒలీవియా, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ లు అద్భుతంగా నటించి అందరి మనసులు దోచుకున్నారు అని తెలిపాడు.
ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ కల సాకారమయ్యేలా చేసిన నిర్మాత డీవీవీ దానయ్యకు కృతజ్ఞతలు.. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంగీతంతో ప్రాణం పోసిన కీరవాణికి ధన్యవాదాలు..భారతీయ సినీ చరిత్రలోనే ఓ అద్భుతమైన కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కు జీవితాంతం రుణపడి ఉంటాను.. సెంథిల్, సాబూ, శ్రీనివాస్ మోహన్, శ్రీకర్ ప్రసాద్.. సినిమాలోని ప్రతి టెక్నీషియన్ కు పేరుపేరునా కృతజ్ఞతలు.. సినిమాకు యాంకర్ గా నిలబడింది కార్తికేయ. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లిన కార్తికేయకు ధన్యవాదాలు. ‘నాటు నాటు’ పాటకు కొరియోగ్రఫీ చేసి.. జనానికి కొత్త స్టెప్పులను పరిచయం చేసిన ప్రేమ్ రక్షిత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అడుగడుగునా అండగా నిలిచిన వారికి.. మీడియా సంస్థలకు.. చివరిగా నా అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూథ్యాంక్యూ నోట్ లో పేర్కొన్నాడు ఎన్టీఆర్.
I’m touched beyond words… pic.twitter.com/PIpmJCxTly
— Jr NTR (@tarak9999) March 29, 2022



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: