టాలీవుడ్ లో హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరోల్లో ఆది సాయికుమార్ కూడా ఉన్నాడు. ఆది రీసెంట్ గా సాలిడ్ హిట్ కొట్టింది లేదు.. కానీ ప్రస్తుతం తన లిస్ట్ లో మాత్రం చాలా సినిమాలు ఉన్నాయి. తీస్ మార్ ఖాన్, అతిథి దేవోభవ, కిరాతక ఇంకా పలు సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకోగా.. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశాడు. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న బ్లాక్ సినిమా రిలీజ్ డేట్ ను ఫైనల్లీ ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అది సాయి కుమార్ హీరో గా జి బి కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్లాక్. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ పలు కారణాల వల్ల రిలీజ్ చాలా ఆలస్యం అయింది. డిఫరెంట్ కథతో వస్తున్న ఈసినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది కూడా. విడుదల అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు జి బి కృష్ణ మాట్లాడుతూ.. “బ్లాక్ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఆది గారి నటన, కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. మా నిర్మాత మహంకాళి దివాకర్ గారు రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ట్రైలర్ ను విడుదల చేసి ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తాం” అని తెలిపారు.
నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ.. “మా బ్లాక్ చిత్రం ఏప్రిల్ 22న విడుదల అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. మంచి కథ, కథనం తో చిత్రాన్ని నిర్మించాము. మా దర్శకుడు జి బి కృష్ణ మంచి చిత్రాన్ని అందించాడు. సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఉంది” అని తెలిపారు.
కాగా ఈసినిమాలో దర్శన హీరోయిన్ గా నటిస్తుండగా ఆమని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ ఫేమ్ కౌషల్ కూాడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మహాంకాళి మూవీస్ బ్యానర్‌పై మహాంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సురేషన్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: