డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమ మార్క్ యాక్షన్, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Congratulations to the entire team of #RRRMovie and @DVVMovies for the grand success.
Sensational performances by @tarak9999 and @AlwaysRamCharan.
What else can we expect from a @ssrajamouli sir film 🙏🏼— Prashanth Neel (@prashanth_neel) March 25, 2022
“ఆర్ ఆర్ ఆర్” మూవీ పై చిత్ర పరిశ్రమ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా వేదికగా “ఆర్ ఆర్ ఆర్”టీమ్ కు అభినందనలు తెలిపారు. “ఆర్ ఆర్ ఆర్” మూవీ అద్భుతమనీ ,ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సెన్సేషన్.అనీ , రాజమౌళి సర్ దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. “కెజిఎఫ్” మూవీతో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ “ఆర్ ఆర్ ఆర్” ని పొగుడుతూ ట్వీట్ చేయడంతో “ఆర్ ఆర్ ఆర్” టీమ్ ప్రశాంత్ నీల్ కి కృతజ్ఞతలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: