ఇప్పుడు హీరోలు చాలా మంది తమ సొంత ప్రొడక్షన్ హౌస్ లను ఏర్పాటు చేసుకొని వారే సొంతగా సినిమాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు హీరోయిన్లు కూడా అదే బాటలో వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లు ప్రొడక్షన్ హౌస్ లు పెట్టి నిర్మాతలుగా మారారు. ఈనేపథ్యంలో మరో హీరోయిన్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మేఘా ఆకాష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తుండగా.. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందిస్తున్నాడు. ఈసందర్భంగా మేఘా ఆకాష్ మాట్లాడుతూ..డియర్ మేఘ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పనిచేశాను. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఇది మా అమ్మ సమర్పిస్తున్న సినిమా కాబట్టి నాకు చాలా స్పెషల్ అంటూ తెలిపింది. కాగా ఈసినిమాలో రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్ మరో కీలకపాత్రల్లో నటిస్తుండగా.. హరి గౌర సంగీతం అందిస్తున్నారు.
మరి మేఘా ఆకాష్ కూడా చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తుంది. తను కెరీర్ ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటి వరకూ సాలిడ్ హిట్ కొట్టింది లేదు. తెలుగులో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నా కూడా ఇంకా కెరీర్ లో వెనుకబడే ఉంది. మరి ఈసినిమాతో అయినా మేఘా ఆకాష్ తన హిట్ ఖాతాను తెరుస్తుందో..? లేదో? చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: