చేతన్ కుమార్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన సినిమా జేమ్స్. ఈసినిమా పునీత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా మరోసారి పునీత్ రాజ్ కుమార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించింది. పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో జేమ్స్ సినిమా ఆయన నటించిన చివరి సినిమా కావడంతో ఈసినిమాను పునీత్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరూ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈసినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈనేపథ్యంలోనే విడుదలైన రోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగించింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. పునీత్ పాత్రకి శివరాజ్ కుమార్ వాయిస్ ఇచ్చారు. కిశోర్ పత్తికొండ నిర్మించిన ఈసినిమాను కన్నతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో కూడా రిలీజ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: