సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 4 తమిళ , “భ్రమమ్ ” మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ “యోధ”లో రాశీఖన్నా నటిస్తున్నారు., “ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ ,డి కె తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “బ్లెస్సింగ్ “లో రాశీఖన్నా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ దేవగన్ తో రాశీఖన్నా నటించిన “రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్” వెబ్ సిరీస్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. తాజాగా రాశీఖన్నా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “రుద్ర” వెబ్ సిరీస్ , అందులోని తన పాత్రకు ఇంత భారీ స్పందన వస్తుందని ఊహించలేదనీ , ప్రేక్షకులు ఓటీటీలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారనీ , తాను ఓటీటీలను ఎంచుకోవడానికి కారణం తన దగ్గరికి వచ్చిన వైవిధ్యమైన పాత్రలే అనీ , హీరోయిన్ అంటే డ్యూయెట్స్ కోసమో రొమాంటిక్ సీన్స్ కోసమో సృష్టించిన గ్లామర్ డాల్ కాకూడదనీ , స్క్రిప్ట్ లో బలం ఉంటే ఎలాంటి పాత్ర లో నటించడానికైనా సిద్ధమేననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: