సర్కారు వారి పాట సినిమా నుండి అప్ డేట్ రావడమే లేట్.. ఇలా సోషల్ మీడియాలో నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వెళిపోతుంది. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గర నుండి తాజాగా రిలీజ్ అయిన పెన్నీ సాంగ్ వరకూ అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ముందు బ్లాస్టర్ పేరుతో చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అది ఓ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇటీవల వచ్చిన కళావతి సాంగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు సెలబ్రిటీలు సైతం స్టెప్పులు వేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా పెన్నీ సాంగ్ రిలీజ్ అవ్వగా అది కూడా ఇప్పుడు యూట్యూబ్ లో మిలియన్ల రేంజ్ లో వ్యూస్ ను దక్కించుకుంటూ టాప్ 1 ట్రెండింగ్ లో నిలిచింది. ఈ పాటలో మహేష్ ముద్దుల కూతురు సితార కూడా కనిపించడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. కళావతి పాటకి 24 గంటల్లో 14 మిలియన్స్ వ్యూస్ రాగా ఇక పెన్నీ సాంగ్ 22 గంటల్లో 15 మిలియన్స్ పైగా వ్యూస్ ను దక్కించుకుంది. దీంతో ఇప్పుడు తెలుగులో ఫాస్టెస్ట్ 15 మిలియన్స్ వ్యూస్ అందుకున్న పాటగా రికార్డ్‌కు ఎక్కింది.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: